ఇవాళ ఖిలాడీ ట్రైల‌ర్ విడుద‌ల

-

మాస్ మ‌హారాజా ర‌వితేజ లాస్ట్ ఇయ‌ర్ 2021లో కొవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌రువాత క్రాక్ మూవీతో బోణి చేశారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. క‌రోనా త‌రుణంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియ‌న్స్ థియేట‌ర్స్ కు వ‌స్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ ఈ సినిమా క‌లెక్ష‌న్ల విష‌యంలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అద‌ర‌గొట్టింది. ర‌వితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయ‌న‌కు కొత్త ఊపిరినిచ్చింది. మ‌రొక‌వైపు బ‌లుపు, డాన్‌శ్రీ‌ను త‌రువాత క్రాక్‌తో గోపిచంద్ మ‌లినేనితో ర‌వితేజ హ్యాట్రిక్ హిట్ న‌మోదు చేశారు.

ఆ సినిమా త‌రువాతవ‌రుస‌గా సినిమాల‌ను చేస్తున్నారు ర‌వితేజ‌. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్ప‌టికే ఈసినిమాలోని ఐదు పాట‌ల‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. క్యాచ్‌మీ అంటూ సాగే పాట‌ను ఫిబ్ర‌వ‌రి 05ను విడుద‌ల చేశారు. మంచి మాస్ బీట్ తో సాగుతున్న ఈ పాట‌ను నేహా బాసిన్‌, జస్‌ప్రీత్ జాబ్ పాడారు. శ్రీ‌మ‌ణి రాసారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. తాజాగా ఈ సినిమా గురించి మ‌రొక అప్‌డేట్ వ‌చ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ట్విట్ చేసింది చిత్రబృందం.

Read more RELATED
Recommended to you

Latest news