బద్వేలు రిజల్ట్…నాలుగురకాలుగా నష్టపోయిన టీడీపీ…?

-

బద్వేలు ఉపఎన్నిక పోరులో వైసీపీ-బీజేపీలు తలపడితే…మధ్యలో టీడీపీ నష్టపోయిందనే చెప్పాలి. అదేంటి పోటీ చేయని టీడీపీ ఎలా నష్టపోతుందని అంతా అనుకోవచ్చు. ఇక్కడే ఒక లాజిక్ ఉంది…సరే బద్వేలులో వైసీపీ దాదాపు 90 వేల ఓట్లపైనే మెజారిటీతో బీజేపీపై గెలిచింది. సరే ఇక్కడ గెలిచింది వైసీపీ, ఓడింది బీజేపీ…. కానీ నష్టపోయింది మాత్రం టీడీపీనే.

అది ఎలా అంటే గత ఎన్నికల ఫలితాన్ని…ఇప్పుడు ఉపఎన్నిక ఫలితాన్ని ఒక్కసారిగా చూసుకుంటే…గత ఎన్నికలో వైసీపీకి దాదాపు 95 వేల ఓట్లు వచ్చాయి…అలాగే టీడీపీకి 50 వేల ఓట్ల వరకు వచ్చాయి. అదేవిధంగా కాంగ్రెస్‌కు దాదాపు 2300 ఓట్లు, బీజేపీకి 735 ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అంటే టీడీపీ ఓటర్లు మామూలు న్యూట్రల్‌గా ఉండిపోవాలి…లేదా ఎవరికి వారు కావల్సిన వాళ్ళకు ఓట్లు వేయాలి…కాకపోతే ఇక్కడ ప్రత్యర్ధిగా ఉన్న వైసీపీకి ఓటు వేయడానికి ఆసక్తి చూపరు.

కానీ టీడీపీ చేసిన ఒక మిస్టేక్ వల్ల…బద్వేలులో టీడీపీ ఓట్లు నాలుగు రకాలుగా చీలిపోయాయని చెప్పాలి. టీడీపీ…పరోక్షంగానే కాదు…ప్రత్యక్షంగా బీజేపీకి సపోర్ట్ ఇచ్చారని అర్ధమైంది. అలాగే ఎలక్షన్ సమయంలో పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లు టీడీపీ నేతలు పనిచేశారు. ఇలా టీడీపీ నేతలు బీజేపీ వైపుకు వెళ్ళడంతో బద్వేలులో ఉన్న మెజారిటీ దళిత ఓటర్లు.. వైసీపీ వైపుకు వెళ్లారు. అలాగే కొందరు బీజేపీకి…మరికొందరు కాంగ్రెస్ వైపు కూడా మొగ్గు చూపారని తెలుస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లు ఓడిపోయాయిగానీ, నష్టపోలేదు.

ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీకి 735 ఓట్లు పడితే…ఇప్పుడు 21 వేల ఓట్లు పైనే పడ్డాయి. అలాగే కాంగ్రెస్‌కు 2300 వరకు ఓట్లు పడితే..ఇప్పుడు 6 వేల ఓట్లు పైనే పడ్డాయి. అంటే టీడీపీ ఓట్లు…వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు పంచుకున్నాయి. ఆఖరికి కొందరు టీడీపీ మద్ధతుదారులు నోటాకు కూడా వేసినట్లు తెలిసింది. అందుకే గతంలో కంటే నోటా ఓట్లు ఇప్పుడు బాగా పెరిగాయి. అప్పుడు 2 వేల ఓట్లు వరకు పడితే..ఇప్పుడు 4 వేల ఓట్లు వరకు వచ్చాయి. మొత్తానికైతే బద్వేలులో బొక్క పడింది టీడీపీకే.

Read more RELATED
Recommended to you

Latest news