బేకుడ్ రోజ్ బాల్స్.. ఆయిల్ ఫ్రీ.. టేస్ట్ లో నో డౌట్..!

-

రోల్స్ తినడం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దలకు వరకూ అందరికి ఇష్టం ఉంటుంది. బయట తినే రోల్స్ అన్నీ మైదాపిండితో చేస్తారు. ఇంకా విపరీతంగా ఆయిల్ వాడతారు. ఇవి తింటే..ఆ టైమ్ కు టేస్టీగా ఉంటాయి కానీ.. ఆరోగ్యానికి మంచిది కాదు.. మనం ఈరోజు.. హెల్తీగా.. ఎక్కువ వెజిటెబుల్స్ వాడి, ఆయిల్ లేకుండా..ఆరోగ్యానికి ఏమాత్రం హాని లేకుండా.. అంతే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా..!

బెకుడ్ రోజ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

మల్టీగ్రెయిన్ పిండి ఒక కప్పు
పెరుగు అరకప్పు
క్యారెటు తురుము అరకప్పు
పన్నీరుతరుము అరకప్పు
వేపించిన వేరుశనగపప్పులు అరకప్పు
ఉడకపెట్టిన బంగాళదుంపలు రెండు
పుదీనా పావు కప్పు
కొత్తిమీర పావు కప్పు
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
ఎండుమిరపకాయలు చెక్కాముక్క చేసింది ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీ గ్రెయిన్ పిండి, పెరుగు, కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండి కలిపినట్లు కలిపి పక్కన పెట్టేయండి. స్ఠఫింగ్ కోసం.. ఒక బౌల్ లో ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసి చిదిమేయండి. అందులోనే క్యారెట్, పన్నీరు తురుము వేయండి. పుదీనా, అల్లం తురుము, వాము, జీలకర్ర, ఎండుమిరపకాయల పొడి, చాట్ మసాల పొడి, పసుపు, వేపించిన వేరుశనగ పప్పులు ముక్కా చెక్కా, కొత్తిమీర, నిమ్మరసం ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. వీటిని ఉండలుగా చేయండి. ముందుగా కలిపి ఉంచుకున్న మల్టీగ్రెయిన్ పిండితో చిన్న పూరీ సైజ్ చేసుకుని ఏదైనా రింగ్ తో కట్ చేస్తే.. రౌండ్ గా వస్తుంది.

చాక్ తో నాలుగు వైపులా కట్ చేయండి.. మధ్యలో కట్ చేయొద్దు. మధ్యలో స్టఫింగ్ బాల్ పెట్టి.. నాలుగు వైపులా ఫోల్డ్ చేయండి. గులాబీ రేకుల్లా వస్తుంది. ఇలా చేసుకున్న వాటిని పొయ్యిమీద మందపాటి అల్యూమినియం పాత్ర పెట్టి అందులో ఏదైనా రింగ్ టైప్ ఉండేది పెట్టి ఆపైన ప్లేట్ కి మీగడ రాసి ఈ రోజ్ బాల్స్ పెట్టండి. మూత పెట్టి 25-30 నిమిషాల సేపు బేక్ చేయండి. టమోటా సాస్ పెట్టకుని తింటే.. ఆహా సూపర్ టేస్ట్.. ఆయిల్ లేదు కాబట్టి.. మీ ఇష్టం ఎన్నైనా తినేయొచ్చు. ఎలాంటి సమస్యా ఉండదు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news