“బలగం” సింగర్ మొగిలయ్యకు కేసీఆర్ సర్కార్ అపన్న హస్తం

-

బలగం సినిమా సింగర్ మొగిలయ్యకు కేసీఆర్‌ సర్కార్ అపన్న హస్తం అందించింది. కిడ్నీలు ఫెయిల్​ ఐన మొగిలయ్యకు ఉచిత వైద్యం అందించేందుకు ముందుకు వచ్చింది సర్కార్‌. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. వైద్య సహాయ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఫోన్ కాల్ చేశారు కేటీఆర్‌.

ఈ మేరకు ఎల్​వోసీ ప్రయత్నాలు ప్రారంభించారు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​ రెడ్డి. అలాగే… వారి ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వ పథకం వర్తింపజేసేందుకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంరవ్వ, మొగిలయ్య దంపతుల ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచనలు చేశారు. రెండు రోజుల్లో నిమ్స్ కు బలగం మొగిలయ్యను తరలించనున్నారు. ఇప్పటికే బలగం డైరక్టర్ వేణు వెల్ధండి రూ.లక్షా ఆర్థిక సాయం చేశారు. త్వరలోనే దిల్ రాజు ప్రోడక్షన్ నుంచి అందనుంది ఆర్థిక సాయం.

Read more RELATED
Recommended to you

Latest news