ఫ్యాక్ట్ చెక్: రూ.2,000 దాటిన ట్రాన్సాక్షన్స్ కి 1.1% చార్జీలు పడతాయా..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది నకిలీ వార్తల వలన మోసపోతున్నారు. బ్యాంకులకు సంబంధించిన విషయాలు మొదలు స్కీముల దాకా ఉద్యోగాలు మొదలు ఫోన్ రీఛార్జ్ ల వరకు ఎన్నో నకిలీ వార్తలు మనకి తరచు కనపడుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఏది నకిలీ వార్త.. ఏది నిజమైన వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది, మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. రూ. 2000 రూపాయలు దాటి యూపీని ట్రాన్సాక్షన్ చేస్తే ఏప్రిల్ 1.1 శాతం చార్జీలు పడతాయని ఆ వార్తలో ఉంది ఇండియా టుడే ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ మరి ఇండియా టుడే చెప్పిన విషయం నిజమేనా రూ. 2000 రూపాయలు దాటి యుపిఐ ట్రాన్సాక్షన్ చేస్తే చార్జీలు పడతాయా ఇందులో నిజం ఎంత అనేది చూస్తే ఇటువంటి నకిలీ వార్త అని తెలుస్తోంది.

ఇండియా టుడే చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త వట్టి నకిలీ వార్త మాత్రమే. కాబట్టి అనవసరంగా ఈ విషయాన్ని నమ్మకండి. అలానే ఇతరులతో కూడా పంచుకోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. యూపీఐ ట్రాన్సాక్షన్లకి ఇలాంటి చార్జీలు ఏమీ పడమని చెప్పేసింది.

Read more RELATED
Recommended to you

Latest news