సినిమా టికెట్ల రేట్లపై చర్చించేందుకు తనను సీఎం జగన్ పిలిచినా నేను రానని చెప్పానిని బాలకృష్ణ అన్నారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్నప్పడే… అఖండ సినిమా భారీ సక్సెస్ సాధించిదని ఆయన అన్నారు. తాను జగన్ ను కలవబోనని అన్నారు. తాను సినిమా బడ్జెట్ పెంచబోనని ఆయన అన్నారు.
టికెట్ రేట్లపై ఇటీవల సిని ప్రముఖులు సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా.. ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య టికెట్ రగడ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో గతంలో మెగాస్టార్ చిరంజీవి సీఎంను విడిగా కలిసి చర్చించారు. ఇటీవల మరోసారి మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, పోసాని, నారాయణ మూర్తి, కొరటాల శివ కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలో బాల కృష్ణ, మోహన్ బాబులకు ఆహ్వానం అందలేదనే వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం బాల కృష్ణ ప్రకటనతో ఆయనను కూడా చర్చలకు పిలిచినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో ప్రభుత్వం టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం తీసుకుందని సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో లాగే ఏపీలో కూడా సినీ పరిశ్రమను డెవలప్మెంట్ చేాయాలని సీఎం కోరినట్లు వెల్లడించారు.