ఇప్పటికే కరోనా వైరస్ తో మనమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఒమీక్రాన్ కూడా చాలా దేశాల ప్రజలు ఇబ్బంది పెడుతోంది. ఇదిలా ఉంటే మరో పక్క ఒక వ్యక్తి లస్సా ఫీవర్ తో చనిపోయారు. బ్రిటన్ కి చెందిన ఒక వ్యక్తి తాజాగా ఈ ఫీవర్ తో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఈ ఫీవర్ ఎలా వస్తుంది..?, దీని యొక్క లక్షణాలు, రిస్క్, ట్రీట్మెంట్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
ఈ ఫీవర్ అనేది ఎబోలా అండ్ మార్బర్గ్ వైరస్ జాతికి చెందింది. అయితే ఇది ప్రాణాంతకం కాదు. రిస్క్ అయితే మాత్రం తక్కువగానే ఉంటుంది. అయితే ఇద్దరు ఈ ఫీవర్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఒకరు వైద్యం తీసుకుంటుండగా మృతి చెందారు. మరొకరు రికవరీ అయ్యారు.
లస్సా ఫీవర్ అంటే ఏంటి..?
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పిన దాని ప్రకారం ఈ వైరస్ ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా ఇది వెస్ట్ ఆఫ్రికా లో ఉంటుంది. నైజీరియా, లైబీరియా వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఇది సోకుతుంది. ఎలుకలు ఇన్ఫెక్ట్ అయ్యి.. ఆహారాన్ని ముట్టుకుని వాటిని మనం తిన్నా లేదు అంటే వాటి యూరిన్ ద్వారా కానీ ఈ వైరస్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఈ ఫీవర్ తో సతమతమౌతుంటే వాళ్ల నుంచి కూడా ఇతరులకు సోకే అవకాశం ఉంది.
లక్షణాలు:
కొద్దిగా జ్వరం
నీరసం
తలనొప్పి
బ్లీడింగ్
శ్వాసతీసుకోవడంలో సమస్యలు
వాంతులు ముఖం వాయటం
చెస్ట్ లో నొప్పి కలగడం
నడుము నొప్పి
సాధారణంగా ఈ లక్షణాలు ఒకటి నుండి మూడు వారాల్లో వస్తాయి. అయితే ఈ వ్యాధి యొక్క రిస్క్ ఎలా ఉంటుంది అనేది డాక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలకలు లేకుండా చూసుకోవాలి. అలాగే హైజీన్ గా ఉండాలి. ర్యాట్ ట్రాప్ వంటివి ఉపయోగించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.