ఐపీఎల్ లో తెలుగు కామెంటరీ తో తడాఖా చూపిస్తున్న బాలయ్య… “దబిడి దిబిడే”

-

ఐపీఎల్ ఈ రోజు ఎన్నో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం మధ్యన మొదలైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ లు పోటీ పడుతున్నాయి. మొదటి టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య పిచ్ ను బాగా పరిశీలించిన తర్వాత ఛేజింగ్ కు మొగ్గు చూపాడు. ఆలా మ్యాచ్ మొదలైందో లేదో… ఒకవైపు ఇంగ్లీష్ కామెంటరీ తో మాజీ క్రికెటర్ లు చెలరేగుతుంటే… మరోవైపు మన నందమూరి బాలకృష్ణ తనదైన మాస్ తెలుగు కామెంటరీతో కామెంటరీ బాక్స్ లో అల్లాడించాడు అని చెప్పాలి. ఈ మధ్యనే బాలకృష్ణను ఐపీఎల్ తెలుగు కామెంటరీ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసింది.

అందులో భాగంగా బాలయ్య స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో తోటి తెలుగు కామెంటేటర్ లు వేణుగోపాల్ రావు, సుమన్ లాంటి వాళ్లతో కలిసి మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తూ బాలయ్య సందడి చేశాడు. మధ్య మధ్య లో తనకు బాగా అలవాటున్న తెలుగు డైలాగ్ దబిడి దిబిడే అంటూ ఆకట్టుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news