ఐపీఎల్ మొదటి గేమ్ లో మొదటి అర్థభాగంగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై లో ఓపెనర్ ఋతురాజ్ గైక్వాడ్ మినహా వేరెవ్వరూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ను ఆడలేదు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఋతురాజ్ గైక్వాడ్ మొదటి నుండి చూడచక్కని డ్రైవ్ లతో ఏ బౌలర్ ను వదలకుండా ఆడాడు. తోటి ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నా గైక్వాడ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి చివరికి 92 పరుగుల వద్ద 17 .1 ఓవర్ వద్ద అల్జారీ జోసెఫ్ బౌలింగ్ లో శుబ్మాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇంకో ఎనిమిది పరుగులు కనుక చేసి ఉంటే ఐపీఎల్ సీజన్ 16 లో మొదటి మ్యాచ్ లోనే సెంచరీని చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 4 ఫోర్లు మరియు 9 సిక్సులు ఉన్నాయి.