“లెజెండ్” బాలయ్య మూవీ నుండి రోరింగ్ అప్డేట్… !

-

 

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే డైరెక్టర్ మలినేని గోపిచంద్ తో వీరసింహారెడ్డి సినిమాతో హిట్ ను అందుకున్నాడు. తన తదుపరి చిత్రం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక రోరింగ్ అప్డేట్ ను అందించడానికి చిత్రబృందం సిద్ధంగా ఉన్నట్లు కాసేపటి క్రితమే ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తీసిన సినిమాలు అన్నీ పక్కా కామెడీ ని బేస్ చేసుకుని తీసినవి కావడం విశేషం. మొదటిసారి ఒక మాస్ హీరోతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అప్డేట్ ను జూన్ 8వ తేదీన రివీల్ చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేయడానికి ఈ తేదీని ఖరారు చేశారట. ఈ సినిమాలో బాలయ్యకు జతగా కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీలలు నటిస్తున్నారు.

మరి అనిల్ రావిపూడి బాలయ్య కాంబోలో రానున్న ఈ సినిమా టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news