ఈ రోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకు పడ్డారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన చూస్తుంటే సొంత పార్టీకి చేసుకుంటున్న ప్రమోషన్స్ పై పెట్టిన శ్రద్ధ, ప్రజల సంక్షేమంపై ఉండడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు కెసిరో పాలనలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా కేవలం తన కుటుంబ అభివృద్ధిని మాత్రమే చూసుకున్నారని… ప్రజల అభివృద్ధిని కాస్త అయినా పట్టించుకోలేదని రెచ్చిపోయి మాట్లాడారు జోషి. ఇదే విధంగా కేసీఆర్ పాలన కొనసాగితే రానున్న ఎన్నికలలో బీజేపీ కచ్చితంగా అధికారాన్ని దక్కించుకుంటుంది అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పుడు తెలంగాణాలో కేంద్రమంత్రి చెబుతున్న విధంగా ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారు అన్నది తెలియాల్సి ఉంది. కాగా తెలంగాణాలో ఎన్నికలు డిసెంబర్ లో రానున్నాయి.