తమిళ్ తలైవా, స్టైల్ కు కేరాఫ్, సూపర్ స్టార్ రజనీకాంత్..సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన పర్సనాలిటీగా ఎదిగారు. అయితే, ఆయన ఎంత ఎదిగానా ఒదిగే ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్..సినీ ఇండస్ట్రీలోకి రాక మునుపు కండక్టర్ గా పని చేశారు. ఇక ఆయన నటించిన చిత్రాల్లో ‘భాషా’కు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలుసు.
సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పిక్చర్ కు సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్ వాకింగ్ స్టైల్, మేనరిజమ్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే, ఈ సినిమా ను తెలుగులో బాలయ్య రీమేక్ చేయాల్సిందట. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో డబ్ చేయడాని కంటే ముందర దర్శకుడు సురేశ్ కృష్ణ ‘బాషా’ పిక్చర్ ను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు.
బాలకృష్ణ లేదా చిరంజీవితో ఈ పిక్చర్ ను రీమేక్ చేయాలని దర్శకుడు భావించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు స్టార్ ప్రొడ్యూసర్స్, స్టార్స్ కోసం దేవీ శ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారట. అయితే, ఈ సినిమా చూసిన తెలుగు నిర్మాతలు, హీరోలకు అంతగా అనిపించలేదట.
ఇక నిర్మాతలు సైతం తెలుగులో బాలయ్య రీమేక్ చేయగలుగుతాడా? అనుకున్నారా? ఏమో తెలియదు. కానీ, ఎవరూ పెద్దగా స్పందించలేదు. బాలయ్య సైతం రీమేక్స్ కు దూరంగా ఉంటుంటారు. అలా ఈ సినిమా అవకాశం బాలయ్యకు రాక మునుపే నో చెప్పేసినట్లయింది. అలా రజనీకాంత్ ‘బాషా’ పిక్చర్ తెలుగులో డబ్ అయి ఘన విజయం సాధించింది. ఒకవేళ ఇదే సినిమాను బాలయ్య రీమేక్ చేసి ఉన్నట్లయితే ఇంకా బాగుండేదేమోనని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.