హిందూపురము జిల్లా కేంద్రంగా ప్రకటించాలని.. అందుకోసం నేను దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మేనిఫెస్టోలో పెట్టారు జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉందని.. జిల్లాకు ఏ పేరు అయినా పెట్టుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. వైసిపి స్పందన బట్టి మా కార్యాచరణ ఉంటుందని.. జిల్లా కోసం అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు.
జిల్లా కేంద్రం కోసం దేనికైనా సిద్ధమేనని.. మా గోడు తెలిపి విన్నవించుకుంటా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని.. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్టీఆర్ జిల్లా పేరు.. జిల్లాల ప్రకటన చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఎక్కడపడితే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు..దానిపైన ఎలాంటి యాక్షన్ లేదన్నారు.
ఎన్టీఆర్ అంటే అంత గౌరవం ఉంటే ఇలా చేస్తారా.. ఇది పొలిటికల్ స్టెంట్ మాత్రమేనని… ఇది నిజమైన ప్రేమ కాదు.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పెట్టడం ఏ ప్రేమతో పెట్టారు అందరికీ తెలిసిందేనని వెల్లడించారు. నిజమైన ప్రేమ ఉంటే చంద్రబాబు, ఎన్టీఆర్ పెట్టిన పథకాలను కంటిన్యూ చేయాలని.. రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ చంద్రబాబు పథకాలను కంటిన్యూ చేశారన్నారు. ప్రజలు ఉద్యమిస్తుంటే పిచ్చి చేష్టలు కోతి చేష్టలు చేస్తున్నారని.. పేరు పెట్టడం కాదు ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు.