మంత్రి బాలినేని వాహనం బోల్తా.. ఒకరి మృతి..!

-

గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తున్న ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వాహనం పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనం టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దాంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో హెడ్‌‌కానిస్టేబుల్ పాపయ్య మృతిచెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి క్షతగాత్రుల్ని ఆస్పత్రిలో పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే చనిపోయిన కానిస్టేబుల్‌ను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. కాగా ఈ ఘటనలో మంత్రి బాలినేనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news