సమ్మర్‌లో ఫ్రైలు తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. రోటి పచ్చళ్లు, అప్పుడే పట్టిన ఆవకాయ అంటే ఇష్టంగా తింటారు. నిజానికి కూరలకంటే రోటి పచ్చళ్లు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే.. ఇలా రోటిపచ్చళ్లు చేసేప్పుడు కూరగాయలను ఎక్కువసేపు ఉడికించరు. జస్ట్ అట్లా పచ్చివాసనపోయే వరకు ఉంచి తీసేస్తాం. ఆయిల్ ఎక్కువగా ఉండదు, ఉప్పు ఎక్కువగా పట్టదు. ఇంకా మనం ధనియాలు, జీలకర్ర ఎలాగూ వేస్తాం కాబట్టి.. డైజెషన్ బాగా అవుతుంది. ఫైబర్ రోటి పచ్చళ్లల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఇవి ఆరోగ్యానకి మేలు చేస్తాయి. ఈరోజు మనం అరటికాయ, వంకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా..!
అరటికాయ వంకాయ రోటి పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు..
అరటికాయ ఒకటి
చిన్నవంకాయలు ఏడు
టమోటా పేస్ట్ ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు టూ టేబుల్ స్పూన్
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి ఒక టీ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టీ స్పూన్
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
తయారు చేసే విధానం..
ముందుగా కూర అరటికాయను లైట్‌గా తోలు తీసి..రెండుగా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టి, అందులోనే వంకాయలు, టమోటా పేస్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించండి. అలా ఉడికిన వాటిని..పప్పుగుత్తితో కచ్చాపచ్చాలా పేస్ట్‌చేసుకోండి. మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుంది. తాలింపు కోసం.. నాన్‌స్టిక్ పాత్రలో మీగడ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు , అల్లం తురుము, పసుపు కొద్దిగా వేసి మీగడలో వేగనివ్వండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్‌గా వేగిన తర్వాత మనం ముందు ఉడికించుకున్న అరటికాయ వంకాయ ముద్దను తీసుకొచ్చి తాలింపులో వేయండి. పులుపుకోసం ఫైనల్‌గా నిమ్మరసం వేసి కలిపేయండి. సాధారణంగా.. మూముులు పచ్చళ్లు తింటే..కడుపులో కాస్త మంటగా అనిపిస్తుంది. ఇలా అలా కాదు.. ఎంత తిన్నా ఏం కాదు. హ్యాపీగా లాగించేయొచ్చు. మీరు ఓ సారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి.!