మండలి డిప్యూటీ చైర్మన్‌గా.. బండా ప్రకాశ్‌ను ఖరారు చేసిన కేసీఆర్‌

-

తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు. ఇవాళ నామినేమిన్ వేయాల్సిందిగా ఆయనకు సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత పార్టీ నాయకులకు చెప్పారు.

మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం 2021, జూన్‌ 3న పూర్తయింది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉన్నది. ఈనేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడింది. నేడు నామినేషన్లను స్వీకరించనున్నారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియను పూర్తిచేసి బాధ్యతలు అప్పగించనున్నారు.

బండా ప్రకాశ్ 2018 మార్చిలో బీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఆరేళ్ల పదవీకాలం పూర్తికాకముందే.. 2021 నవంబర్‌ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్‌ మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version