బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ బాసరలో బంద్ ప్రకటించారు. వ్యాపార సంస్థలు , విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించారు. ఆలయ ప్రాంగణం వద్ద అర్చకులు, సిబ్బంది సేవలు నిలిపివేసి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బాసరలోని ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ స్థానికులు, వ్యాపారులు, విద్యార్థులు రహదారులపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
బాసర సరస్వతీ అమ్మవారిపై రెంజర్ల రాజేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పట్టణం మొత్తం నిరసన వ్యక్తం చేసింది. రాజేశ్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. వెంటనే రాజేశ్‌ను అరెస్టు చేసి పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.