కవితక్కను అరెస్ట్ చేయకపోతే.. ముద్దు పెట్టుకుంటారా ? అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. నిన్న టీచర్ల సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో… బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. అక్కడితే ఆగకుండా… ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
కల్వకుంట్ల కవితపై చేసిన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు. అటు తెలంగాణ ఎంపీ కవిత కూడా బండి సంజయ్ పై మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బండి సంజయ్ ని చెప్పుతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ మాలోవత్ కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకోవాలి…. కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కి అక్కా చెల్లెలు లేరా ? బండి సంజయ్ ని… మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలన్నారు మాలోవత్ కవిత. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామని వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ ని బిజెపి నుంచి బహిష్కరించాలని కోరారు మాలోవత్ కవిత.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు
కవితపై చేసిన అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్ మహిళా ప్రజా ప్రతినిధులు.#KalvakuntlaKavitha #Kavitha pic.twitter.com/FBrvdPgqaC
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2023