కేటీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్ భార్య, అతని తల్లి, పిల్లలతో గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రమాణం చేయాలి అని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇవాళ మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులతో కలిసి గుడిలో కేటీఆర్ ప్రమాణం చేయాలన్నారు.

నేను కూడా నా కుటంబసభ్యులతో కలిసి ఏ గుడికి రమ్మంటే ఆ గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని ప్రకటించారు. అయ్య పేరు, తాత పేరు చెప్పుకొని మీ లాగా రాజకీయాల్లోకి రాలేదు నేను అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
ఇక దీనిపై బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్‌ను పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసే సమయం వచ్చింది… కనకపు సింహాసనం మీద శునకము అనే సామెత ఆయనకు బాగా సరిపోతుందని చురకలు అంటించారు బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి.