బండి సంజయ్ ని కోర్ట్ లో హాజరుపరిచిన పోలీసులు… ఆయన తరుపున బెయిల్ పిటీషన్ దాఖలు

-

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోలో మార్పులు చేయాలని.. ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేయాలని తెలంగాన బీజేపీ ఛీఫ్  బండి సంజయ్ నిన్న ’జాగారణ దీక్ష‘ చేస్తున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న అదుపులోకి తీసుకున్న బండి సంజయ్ ని పోలీసులు మానకొండూర్ పీఎస్ కు తరలించారు. ఈరోజు ఉదయం నుంచి  కరీంనగర్​లోని కమిషనరేట్​ ట్రైనింగ్​ సెంటర్​లో ఉంచారు.

అయితే తాజాగా బండి సంజయ్ ని కరీంనగర్ కోర్టుకు తరలించారు. బండి సంజయ్ తో పాటు మరో నలుగురిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్ పై కోవిడ్ ఉల్లంఘనలుకు సంబంధించిన కేసులను పెట్టినట్లు తెలిసింది. అయితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే మరోవైపు బండి సంజయ్ తరుపున న్యాయవాదులు బెయిల్ కోసం అప్లై చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఉపాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమే అని బండి సంజయ్ ప్రకటించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news