ఈడీ అంటే ఎంత భయమో కేసీఆర్ మాటల్లోనే అర్ధమైంది – బండి సంజయ్

-

మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వింటే… ఆయన గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం కన్పించాయని ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్. ఆల్రెడీ టీఆర్ఎస్ పతనం ఖాయమైనట్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టంగా కన్పించిందని… చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రధానమంత్రివర్యులు, కేంద్ర హోంమంత్రి వర్యులపై అవాకులు చవాకులు పేలారని వెల్లడించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే భాషేనా అది ? ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారని ఆగ్రహించారు.

ఈడీ అంటే ఎంత భయమో ఆయన మాటల్లోనే అర్ధమైందని… అందుకే ఆ సంస్థపై నోటికొచ్చినట్లు తూలనాడారని నిప్పులు చెరిగారు. పచ్చి అబద్దాలు, దొంగ మాటలతో మునుగోడు ప్రజలను కేసీఆర్ మాయ చేసే ప్రయత్నం చేశారని.. పదేపదే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతులను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లేయించుకోవాలని చూస్తున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

కానీ రైతులకు వాస్తవాలు తెలుసు. ఇదే విషయాన్ని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని.. బావుల వద్ద ఫ్రీ కరెంట్ ఇస్తూ… ఇండ్ల వద్ద కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆగ్రహించారు. క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేంద్రాన్ని నిందించడం సిగ్గు చేటు అని.. క్రిష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోవడానికి ముమ్మాటికీ కేసీఆరే కారణమని ఫైర్ అయ్యారు బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news