ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ భుజంపై తుపాకీ పెట్టి సీఎం కేసీఆర్ కాల్చుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంనపై కేసీఆర్ నాలుగేళ్లు ఆలోచించారన్నారు. గవర్నర్ మాత్రం ఆలోచించకూడదా? ప్రశ్నించారు. ఆగమేఘాల మీద గవర్నర్ స్టాంప్ వేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలా? అని నిలదీశారు.
బిల్లుతో ఏదైనా నష్టం వస్తే గవర్నర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ కాల్చుతున్నారని మండిపడ్డారు. అంత పెద్ద బిల్లుపై రాత్రికి రాత్రే ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. కార్మికులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో బిల్లును గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సంజయ్ తెలిపారు. అసలు ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి కేసీఆరే కారణమని ఆరోపించారు.
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందలేదని బండి సంజయ్ అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. పాత పథకాలను తీసివేసి, కొత్త పథకాలను ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.