మీరు సీఎం సీఎం అన్నందుకే నా పోస్ట్ పోయింది: బండి సంజయ్

-

ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జన్నారంలో జరుగుతున్న బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ అధికార పార్టీ మరియు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలకు అభిమాన జనం ఈయనను ఉద్దేశించి… సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ నినాదాలపై బండి సంజయ్ చాలా హాస్యాస్పదంగా స్పందించారు. మీరు ఇలా సీఎం సీఎం అన్నందుకే నాకున్న పోస్ట్ కూడా ఊడిపోయింది అంటూ కామెడీ గా కామెంట్ చేశారు బండి సంజయ్. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నుండి అధిష్టానం సంజయ్ ను తొలగించి ఆ బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఎలాగు సీఎం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా తెలంగాణాలో మీరంతా కలిసి బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే ఒక బీసీ నే సీఎం అవుతాడు అంటూ బండి సంజయ్ తెలియచేశాడు.

మరి నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలలో ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version