కార్నర్ మీటింగ్‌ల వల్ల ప్రజలకు బీజేపీపై నమ్మకం ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మండల కమిటీలు, శక్తికేంద్రాలు, బూత్ కమిటీలు 80 శాతం ఏర్పాటు చేశామని తెలిపారు. సంస్థాగత బలం వల్లే 18 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చామని వెల్లడించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన బూత్‌స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ వంటి జాతీయ నాయకులు పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌లలో చేయాల్సిన పని, సరల్ యాప్‌పై కమిటీలు బీజేపీ కమిటీలు నియమించింది.
“తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజా పాలనను గాలికొదిలి.. కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్కు ఎప్పటికైనా ప్రత్యామ్నాయం బీజేపీయే. ఇది ప్రజలకు కూడా అర్థమైంది. ఏ పార్టీకి పోలింగ్ బూత్ కేంద్రాలు, శక్తి కేంద్రాలు లేవు. 119 నియోజకవర్గంలో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది.” బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు