రైతుల విషయంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్..

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పాదయాత్ర తెలంగాణ అంతటా ఉండనుంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో కొల్చారం మండలంలో కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

రైతుల విషయంలో కేసీఆర్ చేసిందేమీ లేదని, మాటలు మార్చడంలో కేసీఆర్ ముందుంటారని, పంటలు వేసే విషయంలో రైతులను అయోమయానికి గురి చేసారని, ఘన్ పూర్ ఆనకట్టఎత్తు పెంచుతానని చెప్పిన కేసీఆర్, దాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. ఇంకా, కేంద్రంపై అపవాదులు మోపి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తారని, ఇప్పటి వరకు రైతులకు కేసీఆర్ ఏమీ చేయలేదని, ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్, ధాన్యాన్ని కొనాలని కేంద్రాన్ని కోరలేదని, దానికి కారణాలేంటని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.