బండి సంజయ్‌ పాదయాత్ర పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

-

తెలంగాణలో ఒక్కసారి రాజకీయం వేడెక్కింది. నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్‌ స్కాం వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే.. తాజా రాష్ట్ర అధ్యక్షుడు చేపట్టిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింపుపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ విచారణలో భాగంగా ప్రభుత్వం వాదనలు వినిపించింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పోలీసులు యాత్రకు నిరాకరించారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. యాత్రలో బండి సంజయ్ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ఆయన కామెంట్ల వల్ల మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

HC orders Telangana govt. to release Bandi Sanjay

ప్రభుత్వ వాదనపై స్పందించిన న్యాయస్థానం 22 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిన తర్వాత ఇప్పడు అనుమతి చెప్పడమేంటని ప్రశ్నించింది. ఏ కారణాల వల్ల యాత్ర నిలిపేశారో ఆధారాలను రేపటిలోగా సమర్పించాలని ఆదేశించింది. తమ దగ్గర ఉన్న వీడియోలను రేపు.10.30 గంటలకు కోర్టు ముందుంచుతామని తరుపు న్యాయవాది న్యాయమూర్తికి చెప్పారు. దీంతో న్యాయస్థానం కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. తాము చేపట్టిన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని అందులో పేర్కొంటూ బీజేపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. యాత్రను మధ్యలో నిలిపివేయాలంటూ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. పాదయాత్రకు అనుమతిలిచ్చేలా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news