తెలంగాణలో బియ్యం సేకరణ (సీఎమ్మార్) చేయాలని ఎఫ్ సీఐకి ఆదేశాలిచ్చినందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో… రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరివల్లే రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి . రైస్ మిల్లుల్లో ధాన్యం పాడైపోవడానికి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని 2 నెలల పాటు ఆపేయడంవల్లే రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినప్పటికీ… తెలంగాణ ప్రజలను ద్రుష్టిలో బియ్యం సేకరణకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని బండి సంజయ్ అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్వయంగా మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, అందుకు కావాల్సి ఆదేశాలు ఎఫ్‌సీఐకి పంపినట్లు వెల్లడించారు.