ఈ నెల 18న బండి సంజయ్ విచారణ

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టు గా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు మంగళవారంనాడు లేఖ ద్వారా తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున బండి సంజయ్ కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేపట్టింది. ఈ నెల 15వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో మహిళా కమిషన్ ఆదేశాలు చేపట్టింది. ఈ నోటీసులకు బండి సంజయ్ ఇవాళ సమాధానం పంపారు. పార్లమెంట్ సమావేశాలున్నందున ఈ నెల 15న విచారణకు రాలేనని ఆ లేఖలో బండి సంజయ్ తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన అంశంపై బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ పై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేపట్టారు.

 

ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీ అంజనీ కుమార్ ను రాష్ట్ర మహిళా ఆదేశాలు చేపట్టింది.
ఈ ఆదేశాల మేరకు డీజీపీ రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా బండి సంజయ్ కు నిన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మహిళా కమిషన్ కు బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలున్నందున ఈ నెల 18న విచారణకు హాజరు కానున్నట్టుగా ఆయన పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news