కమ్యూనిస్టులతో కుమ్మక్కై.. చైనాకు కేసీఆర్‌ మద్దతు తెలుపుతున్నాడు : బండి సంజయ్‌

-

నిన్న సీపీఎం నేతలు, కేరళ సీఎం పినరయి విజయన్‌ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌ రావు సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశంపై తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కమ్యూనిస్టులతో కుమ్మక్కై చైనాకు సీఎం కేసీఆర్‌ మద్దతు తెలుపుతున్నాడని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన సిపిఎం పార్టీ వాళ్ళతో సీఎం కేసీఆర్‌ ఎలా భేటీ అవుతారని ప్రశ్నించారు బండి సంజయ్‌.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం, వామపక్ష పార్టీల కోసం కేసీఆర్‌ పని చేస్తున్నాడు.. ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేస్తే బిజెపి కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నాడు కానీ బిజెపి కార్యకర్తలు భయపడతారా అని తెలిపారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికీ ఎనిమిది సార్లు జైలుకు వెళ్లామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్టను… నీ కుటుంబాన్ని వదిలి పెట్టాము ఎక్కడున్నా జైలుకు పంపుతామని వార్నింగ్‌ ఇచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే.. జీవో 317 లో బొంద పెడతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news