కేసీఆర్ నీచ చరిత్రను ఎండగట్టిన నేత..ఆలే నరేంద్ర – బండి సంజయ్‌

-

కుహానా లౌకిక శక్తులకు సింహ స్వప్నం ఆలె నరేంద్ర అని బీజేపీప రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కొనియాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన నాయకుడు నరేంద్ర అని అభివర్ణించారు. తెలంగాణ బద్ద వ్యతిరేకి ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీని వ్యతిరేకించిన నరేంద్ర కేసీఆర్ నీచ చరిత్రను ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేశారు.

నరేంద్ర స్పూర్తితో హిందువులను సంఘటితం చేస్తామన్నారు. ఆదివాసీల ఆరాధ్య దైవం రాంజీగోండు, కొమరం బీం వంటి నేతల జీవిత చరిత్రను సైతం పాఠ్యంశాల్లో చేర్చేందుకు క్రుషి చేస్తామన్నారు. ఈరోజు టైగర్ ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ సహా పలువురు రాష్ట్ర నాయకులు నరేంద్రకు నివాళులు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news