స్మార్ట్ లేకుండా ఎవ్వరు లేరు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల యాప్ లతో సరికొత్త టెక్నాలజీ తో కంపెనీలు కొత్త ఫోన్లను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు..కరోనా మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ క్లాసుల జోరు పెరిగింది. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడే సమయం కూడా విపరీతంగా పెరిగింది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. కొన్నిసార్లు పేలవమైన భంగిమతో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా స్మార్ట్ ఫోన్ వాడకం కారణమవుతుంది. అయితే స్క్రీన్ సమయం ఎక్కువగా గడపడం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి కొంతమంది పరిశోధకులు అనేక పరిశోధనలు చేస్తున్నారు. బ్రెజిలియన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల వెన్నెముక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ముఖ్యంగా రోజుకు మూడు గంటల కంటే ఎక్కువసేపు స్క్రీన్‌లను చూడటం లేదా స్క్రీన్‌కు దగ్గరగా ఉండటం లేదా మంచి భంగిమ కూర్చోకపోవడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..
అయితే థొరాసిక్ వెన్నెముక ఛాతీ వెనుక భాగంలో, ఎక్కువగా భుజం బ్లేడ్‌ల మధ్య ఉంటుంది, మెడ దిగువ నుంచి నడుము వెన్నెముక ప్రారంభం వరకు విస్తరించి ఉంటుంది. దాదాపు 14 నుంచి 18 సంవత్సరాల వయస్సు ఉన్న మగ, ఆడ విద్యార్థుల సర్వేల నుంచి ఈ విషయం కనుగొన్నారు. ముఖ్యంగా ఈ సర్వేలో 1,628 మంది పాల్గొన్నారు. అధికంగా ఫోన్ వినియోగం వల్ల ఎక్కువ మంది టీెఎస్పీతో బాధపడుతున్నారని తేలింది. మగవారితో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా టీఎస్పీతో బాధపడుతున్నారు. దాదాపు ఈ సర్వే 10 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది..
ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తున్న వారంతా కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది.. ఇకపోతే 15 నుంచి 35 శాతం మంది పెద్దవారిలో ఈ సమస్య ఉంటుంది. అలాగే కౌమారదశలో ఉన్నవారిలో 13 శాతం-35 శాతం వరకు ఉంటుంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ సమస్యతో బాధపడేవారు అధికమయ్యారు. అయితే హైస్కూల్ విద్యార్థుల్లో టీెఎస్పీ గుర్తింపు చాలా ముఖ్యం. ఎందుకంటే కౌమార దశ నుంచి మంచి ఆరోగ్యం ఇలాంటి సమాచారం మీకు ఉపయోగ పడుతుంది.. అందుకు ఫోన్ కు దూరంగా ఉండటం మంచిది.. లేకుంటే ప్రాణానికి ప్రమాదం అని నిపుణులు అంటున్నారు జాగ్రత్త…