ట్రాఫిక్ చలాన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చింతల్ బస్తీ ప్రాంతంలో నీలం రాజశేఖర్ రెడ్డి వద్ద 52 ఏళ్ల ఎల్లయ్య, అతని భార్య మల్లమ్మ నివాసం ఉంటున్నారు. వారు రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండగా, అతని భార్య అదే ప్రాంతంలో సాయిబాబా ఆలయంలో హెల్పర్ గా పనిచేస్తుంది.

అయితే ఎల్లయ్య వాహనంపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీర్చౌ క్ ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని జప్తు చేసినప్పటి నుంచి అతను మానసికంగా ఆవేదన చెంది.. ట్రాఫిక్ చలానా భారాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లో.. తన ఆత్మహత్యకు వెనుక ట్రాఫిక్ చలాన్లే కారణమని పేర్కొన్నాడు.

అయితే చలాన్లు చెల్లించలేక ఓ సామాన్యుడు ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు డెత్ పెనాల్టీగా మారాయని.. పదివేల చలాన్లు చెల్లించలేక ఎల్లయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సామాన్యుడి పై ప్రతాపం చూపించే బదులు బిఆర్ఎస్ ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు మానవత్వంగా వ్యవహరించాలని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version