బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..త్వరలోనే మీడియా రంగంలోకి !

-

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.

అదంతా కాసేపు పక్కకు పెడితే..నిర్మాత బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోనే ఓ ఛానెల్‌ పెట్టనున్నట్లు బండ్ల గణేష్‌ ప్రకటించారు. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు బండ్ల గణేష్‌. మీరు కూడా ఓ ఛానెల్‌ పెట్టండని ఆయన…అభిమానికి ఒకరు అడుగగా.. దానికి రిప్లై ఇచ్చారు. ఛానెల్‌ పెట్టే పనిలోనే ఉన్నానని బండ్ల గణేష్‌ రీ-ట్వీట్‌ చేశారు. దీంతో ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news