విజయ్ దేవరకొండకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ వార్నింగ్ !

-

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.

అదంతా కాసేపు పక్కకు పెడితే.. టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ పై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. “తాతలు తండ్రులు ఉంటే సరిపోదు టాలెంట్ కూడా ఉండాలి ఎన్టీఆర్ ల మహేష్ బాబు లా రామ్ చరణ్ లా ప్రభాస్ లా గుర్తుపెట్టుకో బ్రదర్ ” అంటూ విజయ్‌ దేవర కొండకు పరోక్షంగా బండ్ల గణేష్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది. విజయ్‌ పేరు ప్రస్తావించకుండా బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. ఆ ట్వీట్‌ విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి, చేసినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. లైగర్‌ ట్రైలర్‌ లాంఛ్‌ టైంలో విజయ్‌… చాలా ఎమోషనల్‌ గా మాట్లాడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news