మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా విజయసాయిరెడ్డి అన్న : బండ్ల గణేష్‌

-

ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి సంస్థలో సోదాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చేస్తున్న వ్యాఖ్యల పట్ల బండ్ల గణేశ్ స్పందించారు. కొండపల్లి సీతారామయ్య రచనలను ప్రచురించే జీజే రెడ్డికి చెరుకూరి రామోజీ వెన్నుపోటు పొడిచాడని… జీజే రెడ్డి ఆస్తిని, కొండపల్లి రచనలను దోపిడీ చేశాడని విజయసాయి ఆరోపించారు. అయితే.. దీనిపై బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. మీకు ఈ విషయం ఎవరు చెప్పారు విజయసాయిరెడ్డి గారు…. ఊరికే అడుగుతున్నా… తెలుసుకోవాలని ఆతృత అంటూ ప్రశ్నించారు బండ్ల గణేశ్.

Better Sai Reddy not stoop down to Bandla level

నాకు తెలిసినంతవరకు రామోజీ రావు గత కొన్నేళ్లుగా పాతికవేల కుటుంబాలకు ప్రతి నెలా జీవనోపాధి కల్పిస్తున్నారు… ఈ విషయాన్ని మీకు ఆతృతతో చెబుతున్నా విజయసాయిరెడ్డి అన్న అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు బండ్ల గణేశ్. మీకు ప్రతిరోజు మంచి సమాచారం అందిస్తాను… మంచి విషయాలు చెబుతా… మిమ్మల్ని మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా విజయసాయిరెడ్డి అన్న అంటూ వివరించారు బండ్ల గణేశ్.

Read more RELATED
Recommended to you

Latest news