నవంబర్‌లో బ్యాంకు సెలవులు.. ఎన్ని రోజులంటే..?

-

సెప్టెంబర్‌, నవంబర్‌ నెలలతో పోలిస్తే నవంబర్‌ నెలలో బ్యాంకు సెలవులు తక్కువగానే ఉంటాయి. నాలుగు ఆదివారాలు, రెండవ శనివారం, నాలుగో శనివారంతో కలిపి సుమారు పది రోజుల పాటు బ్యాంకులు మూత పడతాయి. ప్రతి నెలా బ్యాంక్‌ సెలవులను ఆర్బీఐ అప్‌డేట్‌ చేస్తూ ఉంటుంది. దీని ప్రకారం నవంబర్‌ 1,8,11,23 తేదీల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.

నవంబర్‌ 1 (మంగళవారం) : కన్నడ రాజ్యోత్సవ్‌ / కుట్‌.. కర్ణాటక, మణిపూర్‌ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

నవంబర్‌ ఒకటో తేదీన కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. అందుకే నవంబర్‌ ఒకటో తేదీని కన్నడ రాజ్యోత్సవ్‌గా పరిగణిస్తున్నారు. కుట్‌ ఫెస్టివల్‌ అంటే చవాంగ్‌ కుట్‌. బౌంటీఫుల్‌ హార్వెసట్‌ దీవెనల కోసం చవాంగ్‌ కుట్‌ ఉత్సవాలు నిర్వహిస్తారు.

నవంబర్‌ 8: గురునానక్‌ జయంతి, కార్తీక పౌర్ణమి : త్రిపుర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, అసోం, సిక్కిం, మణిపూర్‌, కేరళ, గోవా, బీహార్‌, మేఘాలయ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

నవంబర్‌ 11 (శుక్రవారం): కనకదాస జయంతి/ వంగాలా ఫెస్టివల్‌ – కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. కనకదాస్‌ ఒక కవి, తత్వ వేత్త.

నవంబర్‌ 23: సెంగ్‌ కుట్స్‌నేమ్‌ లేదా సెంగ్‌ కుట్‌స్నేం – మేఘాలయలో బ్యాంకులు పని చేయవు. ప్రతియేటా ఖాసీ నూతన సంవత్సరం సందర్భంగా ఖాసీ సామాజిక వర్గం వారు నవంబర్‌ 23న ఖాసీ నూతన సంవత్సరాదిగా భావిస్తారు. దీన్నే సెంగ్‌ కుట్‌ స్నేమ్‌ అని పిలుస్తారు. 6,13,20, 27 తేదీల్లో ఆదివారం, 12న రెండో శనివారం, 26న నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.

Read more RELATED
Recommended to you

Latest news