మీ ఎస్బీఐ అకౌంట్ ని ఇలా మారిస్తే మరెన్నో లభాలు పొందచ్చు..!

-

మీకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎస్బీఐ తమ కస్టమర్స్ కోసం కొత్త సర్వీసుని తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ (SBI Saving Plus Account) పేరుతో ఓ కొత్త సర్వీస్ అందిస్తోంది. మామూలు ఎకౌంట్ తో కంపేర్ చేసి చూస్తే.. ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్ ద్వారా వచ్చే లాభాలు ఎక్కువ.

SBI
SBI

సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో దాచుకునే డబ్బులకు 2.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. సేవింగ్ ప్లస్ అకౌంట్‌ హోల్డర్లు సేవింగ్స్ బ్యాలెన్స్‌పై ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అయితే ఇది మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌కు లింక్ అయి ఉంటుంది. మీరు ఇందులో డబ్బులు పెడితే అధిక వడ్డీ పొందొచ్చు. ఆ డబ్బులు ఆటోమెటిక్‌గా టర్మ్ డిపాజిట్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకోవచ్చు.

ఎస్‌బీఐ సేవింగ్ ప్లస్ అకౌంట్‌లో రూ.35,000 కన్నా ఎక్కువగా ఉన్న డబ్బులు మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి వెళ్తాయి. ఈ మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లోకి కనీసం రూ.10,000 జమ అవుతాయి. ఈ అకౌంట్ తీసుకున్నవారికి సాధారణ సేవింగ్స్ అకౌంట్‌లో లభించే ఏటీఎం కార్డులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటి సేవలన్నీ ఉంటాయి.

ప్రతీ ఏడాది 25 చెక్స్ ఉన్న చెక్ బుక్ ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ ఎకౌంట్ గురించి ఓ ఉదాహరణ చూస్తే.. మీ అకౌంట్‌లో రూ.45,000 ఉంటే రూ.10,000, రూ.50,000 ఉంటే రూ.15,000 మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్‌లో జమ అవుతాయి. ఈ మొత్తానికి అధిక వడ్డీ పొందొచ్చు. పూర్తి వివరాలను https://bank.sbi/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news