ఇతరులు తెలుసుకోవాలని ఇంట్రావర్టులు కోరుకునే విషయాలు..

-

మన చుట్టూ పక్కల రకరకాల మనుష్యులు కనిపిస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరేమో, అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. మరికొందరేమో, వారే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఇంకొందరు, అసలు మాట్లాడకుండా ఉంటారు. వీరినే ఇంట్రావర్టులు అంటారు. ఇంట్రావర్టులు ఎక్కువగా మాట్లాడరు. దానివల్ల అవతలి వారు పొగరు అని, మూడీ అని పేర్లు పెట్టేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంట్రావర్టులు కొన్ని విషయాలను ఇతరులు తెలుసుకోవాలని కోరుకుంటారు. అవేంటో ఇక్కడ చూద్దాం.

Introverts
Introverts

సైలెంట్ ఉన్నారంటే సిగ్గని కాదు

ఒక వ్యక్తి ఏం మాట్లాడకుండా ఉంటున్నాడంటే అతడు సిగ్గు పడుతున్నాడని అర్థం కాదు. మాట్లాడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంట్రావర్ట్, ఒకరితో మాట్లాడాలంటే వారి గురించి బాగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడతాడు. దానికి కొద్దిగా టైమ్ పడుతుంది.

మనుషులతో కలవడం వారికి ఇష్టం ఉండదని అనుకోవద్దు.

ఇంట్రావర్టుతో మాట్లాడుతున్నప్పుడు సడెన్ గా మాటలు ఆగిపోయాయంటే అక్కడ మాట్లాడ్డం ఇష్టం లేదని కాదు. వారు మీ నుండి మాటలు కోరుకుంటున్నారని అర్థం. వారికి తమ గురించి చెప్పుకోవడం కన్నా ఇతరుల గురించి వినాలన్న ఆశ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ గురించి చెప్పండి.

హాస్యం అంటే వాళ్ళకూ ఇష్టమే

సైలెంట్ గా ఉంటున్నారని వాళ్ళు హాస్యాన్ని ఇష్టపడరని అనుకోవద్దు. వాళ్ళు జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. తమ చుట్టుపక్కల ఉన్నవారిని గమనించడంలో వారు ఆనందాన్ని పొందుతారు.

ఏకాంతం అంటే ఎక్కువ ఇష్టం

అందరిలో ఉన్నప్పటికీ ఏకాంతాన్ని ఎక్కువ ఇష్టపడతారు. రాసుకోవడం, డ్రాయింగ్, సంగీతం వినడం మొదలగునవి వీరికి మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక్కోసారి గంటలు గంటలు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news