ఆస్ట్రేలియా పార్లమెంట్​ వద్ద బతుకమ్మ సంబురాలు

-

తెలంగాణలో బతుకమ్మ సంబురం షురూ అయింది. ఈ సంబురాలు కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఖండాంతరాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు అక్కడ కూడా మన సంస్కృతిని మరిచిపోకుండా ఆచారాలు పాటిస్తున్నారు. ఏడు సముద్రాల అవతల ఉన్నా మన సాంప్రదాయాలకు విలువనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలో తెలంగాణ వాసులు బతుకమ్మ వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ దేశ పార్లమెంటు ఎదుట బతుకమ్మ పాటలు పాడుతూ ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ACT తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

బతుకమ్మ సంబురాలకు అక్కడి తెలంగాణ వాసులంతా చీరలు, పంచెకట్టులో సంప్రదాయంగా తయారై బతుకమ్మను పేర్చి ఘనంగా వేడుకలు చేసుకున్నారు. బతుకమ్మ పాటలు.. వాటితో రాగయుక్తంగా ఆడుతున్న మహిళల సందడితో కాన్​బెర్రాలోని పార్లమెంట్​ పరిసర ప్రాంతం ఒక్కసారిగా తెలంగాణ వాతావరణాన్ని ప్రతిబింబించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సింగర్​ మను పలు పాటలు పాడి అందరినీ ఉత్సాహపరిచారు. దక్షిణ భారతదేశం తరఫు ఒక పండుగను మొదటిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంట్​నందు నిర్వహించిన ఘనత తెలుగు వారికి దక్కడం గర్వకారణంగా ఉందని అసోసియేషన్​ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news