తెలంగాణ పూల పండగ, తెలంగాణ సంస్క్రుతి సంప్రదాయాలకు ప్రతీక, ఆడబిడ్డల పండగ బతుకమ్మ నేటితో ప్రారంభం కానుంది. తెలంగాణ పల్లెలు, పట్నాలు బతుకమ్మ సంబురాలు సిద్ధం అయ్యాయి. నేడు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండగ చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సమైక్యపాలనలో బతుకమ్మ పాలనును విస్మరించారని అని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో రాష్ట్ర పండగగా గుర్తించామని గుర్తుచేశారు. బతుకమ్మకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చామని ఆయన అన్నారు. పల్లెపల్లెన బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయనుంది.
నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబురాలు
-