కరోనా రక్కసి ధాటికి అన్నీ మూతబడి సంవత్సరం గడిచిపోయింది. పిల్లలు బడికి వెళ్ళక చాలా రోజులైపోయింది. ఐతే ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గాయి. మూడవ వేవ్ పై అనుమానాలు ఉన్నప్పటికీ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠాలు చెప్పడం మొదలెట్టారు. ఐతే ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా రక్కసి తన పంజా విసురుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ.
పెనుమంట్ర మండలం మల్లిపూడి, నెగ్గిపూడి, శివరావు పేట స్కూళ్ళలో ముగ్గురు టీచర్లకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో పిల్లలకు కోవిడ్ పరీక్షలు జరపాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాలలోని విద్యార్థులందరూ ఈ పరీక్ష చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలను స్కూళ్ళకు పంపడానికి తికమకపడుతున్నారు.