జనగామ జిల్లా పాలకుర్తిలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. నిన్న రాత్రి రోడ్డు దాటుతూ స్థానికుల కంట పడింది. ఆ సమయంలో ఆవైపుగా వెళ్తున్న వారు చూసి సెల్‌ఫోన్‌లో ఎలుగుబంటి రోడ్డు దాటుతున్న దృశ్యాలు రికార్డు చేశారు.
ఎలుగుబంటి సంచారంతో పాలకుర్తిలో ఆందోళన మొదలైంది. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. పిల్లలను బయటకు పంపించకుండా జాగ్రత్తపడుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకుని అడవిలో వదిలేస్తామని తెలిపారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట ఎవరూ బయట తిరగొద్దని చెప్పారు.