ఎన్నో ఓటమలు దాటుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే ఓ పెద్ద విజయం. నటీ, నటులకు ఇక్కడ ఉన్న ప్రాధాన్యం రీత్యా ఎవ్వరైనా సరే! తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవాలనుకోవడం సహజం. సహజ సిద్ధం అయిన అందాలకు ఆనవాలుగా నిలిచే కేరళ తీరం నుంచి వచ్చిన ఆ ముగ్ధ సంయుక్త మేనన్ ఆశ కూడా ఇదే! ఆ పిల్ల ఆశ పడుతోంది. మంచి విషయాలు నేర్చుకునేందుకు.. ఆనందపడుతోంది మంచి విజయం అందుకున్నందుకు.. ఆ వివరం ఈ కథనంలో..
కేరళ తీరాల్లో మరో అందం. కేరళ తీరం నుంచి మరో అందం. కేరళ నుంచి నడిచివచ్చిన అందాల భామలు అనుష్క, నిత్యా మేనన్ జాబితాలో మరో ముద్దుగుమ్మ ఆమె పేరు సంయుక్త మేనన్. భీమ్లానాయక్ ఫేం. మాములుగా కాదు ఓ రేంజ్లో నటించి నిన్నటి వేళ అటు పవన్ అభిమాలనూ, ఇటు రానా అభిమానులనూ ఫిదా చేసింది. ఇప్పుడీమె తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కెరియర్ కు బ్రేక్ ఇచ్చేవిధంగా తన తొలి తెలుగు చిత్రం ఉండడం తనకెంతో సంతోషదాయకం అని కూడా అంటుందామె!
సినిమా, సినిమాకు ఫేట్ మారిపోతుంది. సినిమా, సినిమాకు రెమ్యునరేషన్ డీల్స్ మారిపోతాయి. పెద్ద హీరోల సినిమాల్లో కనిపించే తారలు ఓ విధంగా హంగామా చేస్తుంటారు అని అనుకోవడం పొరపాటు. తనకు వచ్చిన అవకాశాన్ని హాయిగా వినియోగించుకుని పేరు తెచ్చుకోవడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు సంయుక్త మేనన్. భాషకు ప్రాధాన్యం ఇస్తూ, నడవడికి ప్రాధాన్యం ఇస్తూ తమదైన శైలిలో రాణించడమే ఇప్పుడున్న సందర్భంలో సంయుక్త మేనన్ కు అత్యవసరం. అదే ఆమె ఉన్నతికి కారణం కూడా! కాగలదు.
తెలుగు నేర్చుకుని మాట్లాడడం. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ డబ్బింగ్ చెప్పడం ఇవన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చాయి. పవన్ తో క్లైమాక్స్ సీన్స్ లో నటించి మెప్పించిన ఆ నటి సంయుక్త మేనన్.ప్రీ రిలీజ్ వేడుకల్లో కూడా సందడి చేసింది. తనకు తిరుగేలేదని సత్తా చాటింది. పవన్ తరుచూ చెప్పే తిలక్ కవితను మరోసారి వినిపించింది. ఇల్లేమో దూరం అంటూ ఎంతో భావోద్వేగ రీతిలో తెలుగు పలికి ప్రతిభ చాటింది.
2016 నుంచి సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటిదాకా మలయాళం, తమిళ భాషల్లో నటిగా రాణించింది. మలయాళంలోనే ఒక వెబ్ సిరీస్ లోనూ నటించింది. కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ఉత్తమ నటి అవార్డును 2020లో అందుకుంది.
ఇప్పుడీ బ్యూటీ తెలుగు సినిమా రంగంలో స్థిరపడిపోవాలని ఆకాంక్షిస్తోంది. అందుకు మన భాష మరింత వివరంగా నేర్చుకుంటోంది. అదేవిధంగా ఇక్కడివారితో మమేకం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. తెలుగు సినిమాలతోనే తన ఖ్యాతిని పెంచుకోవాలని యోచిస్తోంది.ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి!