ఎర్ర చీరలో మెరుస్తున్న చందమామ… కాజల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్

-

చాలా రోజుల తర్వాత చందమామ కాజల్ మరోసారి తన ఫ్యాన్స్ కు కనువిందు చేసింది. ప్రెగ్నెంట్ గా ఉన్న కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలను నెటిజెన్లతో పంచుకుంది. 

ఎర్రచీరతో సంప్రదాయబద్దంగా కనిపిస్తోంది కాజల్ అగర్వాల్. త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న కాజల్ ఆ మధుర క్షణాల కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది కాజల్. 

అయితే ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న కాజల్ కాస్త ఒళ్లు చేసినట్లు కనిపిస్తోంది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వచ్చే మార్పులు కాజల్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 

ఆమె తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఉన్న ఫోటోలను అభిమానలతో పంచుకుంది. ఫోటోలో, కాజల్ అగర్వాల్ గౌతమ్‌ను క్యూట్‌గా కౌగిలించుకుంది.  ఫోటోను షేర్ చేస్తూ కాజల్, “#nofilter #sunshine #stealingmoments” అని రాసింది. కేవలం కొన్ని గంటల్లో, ఫోటోకు దాదాపు నాలుగు లక్షల లైక్‌లు వచ్చాయి.

గతేడాది కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరు.. హనీమూన్ వెకేషన్ మల్దీవులకు వెళ్లారు. ఆ సమయంలో కూడా కాజల్ అగర్వాత్ గౌతమ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news