బ్యూటీ స్పీక్స్ : ముంబ‌యి దారుల్లో పూజా బేబీ ! రాధే శ్యామ్

-

విధికీ,ప్రేమ‌కూ మ‌ధ్య జ‌రిగే యుద్ధం ఎలా ఉండ‌నుంది ? అదే రాధే శ్యామ్ అని అంటున్న ప్ర‌భాస్ కు బోలెడంత అండ‌గా ఉంటూ ఆ ప్రేమ లోకంలో విహ‌రిస్తూ..ఆనందిస్తూ..ఈ క‌న్న‌డ సోయ‌గం ఎన‌లేని పేరు తెచ్చుకుంటోంది..అన్ బీటబుల్ స‌క్సెస్ అందుకుంటోంది.

 

అందం మ‌రియు అభిన‌యం అన్న‌వి ఆక‌ర్ష‌ణ మంత్రాలు అని చెబుతూ వెళ్తోంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్ ఏం చేయాలో ఏం చేయ‌కూడ‌దో..కూడా సూత్రాలు వ‌ల్లిస్తోంది. ప్రేమ పాఠాలు వ‌ల్లె వేస్తోంది.తిరుగులేని పేరు వ‌చ్చాక మ‌న‌కు పూజ ఇలానే అర్థం అవుతుందా ? ఆమె ప్రేమ ఇలానే ప్రేక్ష‌కుల‌కూ మ‌రియు అభిమానుల‌కూ అందుతుందా ? అంటే వై నాట్ అని స‌మాధానం ఇస్తుందేమో ఈ భామ‌.

 

ఈ పొడుగు కాళ్ల సుంద‌రి ప్రేమ క‌థ ఒక‌టి త్వ‌ర‌లోనే సినిమా రూపంలో రాబోతోంది.ఆజానుబాహుడ‌యిన ప్ర‌భాస్ తో తెర పంచుకున్న సినిమా  రాధే శ్యామ్ ప్ర‌మోష‌న్ వ‌ర్క్స్ ఓ వైపు సాగుతుండ‌గా,మ‌రోవైపు సినిమా విడుద‌ల వేళ ప్రీ రిలీజ్ బిజినెస్ వ‌ర్క్స్ కూడా అంతే వేగంగా న‌డుస్తున్నాయి.ఈ వేళ  ఆమె అందం, అభిన‌యం ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని కోరుకుందాం.

 

అల వైకుంఠ పురం ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టిదాకా పూజా బేబీ త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇటు ద‌క్షిణాదితో పాటు అటు ఉత్త‌రాదిలోనూ త‌న‌కంటూ అభిమానులు సంపాదించుకుని రెండు ప్రాంతాల‌లోనూ తిరుగులేని క్రేజ్ ద‌క్కించుకుంటోంది. ర‌ఫ్ గా క‌నిపిస్తాడు కానీ మాట వింటాడు అంటూ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ లో చెప్పిన డైలాగ్ ఇప్ప‌టికీ మార్మోగుతూనే ఉంది.అదేవిధంగా అల వైకుంఠ పురంలో బుట్ట బొమ్మ‌గా అల‌రించిన తీరు, ఆ సినిమాతో ఆమెకు వ‌చ్చిన పేరు ఇప్ప‌టికీ ఓ సెన్సేష‌న్. ఇంకా చెప్పాలంటే మ‌రొక‌రెవ్వ‌రికీ సాధ్యంకానంత స్థాయిలో ఆమె విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది.అందుకే ఆమె బ్యూటీ ఐక‌న్ గా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాదు క్రేజీ ప్రాజెక్టుల‌కు కేరాఫ్ అయి నిలుస్తోంది.

 

న్యూస్ బాక్స్ : తాజా వివ‌రం ఏంటంటే…!

ముంబ‌యి దారుల్లో రాధే శ్యామ్ ఫేమ్ పూజా హెగ్డే సందండి చేస్తున్నారు.త్వ‌ర‌లో విడుద‌ల కానున్న త‌న సినిమా ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ అన్నీ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు.ఆమె కూడా ఓ భాగం అయి సినిమాను ప్రేక్ష‌కుల‌కు,అభిమానుల‌కు చేరువ చేసేందుకు  ప్ర‌య‌త్నిస్తున్నారు.దీంతో పూజా హెగ్డే క్రేజ్ ముంబ‌యి వీధుల్లో ఓ రేంజ్ లో ఉంది. ప్ర‌భాస్ కూడా గ‌తంలో సాహో స‌మ‌యంలో శ్ర‌ద్ధా క‌పూర్ తో క‌లిసి ప్ర‌మోషన్ యాక్టివిటీస్ లో పాల్గొన్నారు. బాహుబ‌లి స‌మ‌యంలో త‌మ‌న్నా తో క‌లిసి హ‌వా సృష్టించారు.

వాస్త‌వానికి ప్ర‌భాస్ కు బాహుబ‌లి క‌న్నా ముందు రెబ‌ల్ సినిమాతోనే అక్క‌డ మంచి క్రేజ్ వ‌చ్చింది.ఈ సినిమా హిందీ వెర్ష‌న్ బుల్లి తెర‌పై ప్ర‌ద‌ర్శిత‌మై సంద‌డి చేసింది. మంచి టీఆర్పీ రేటింగులు అందుకుంది. మంచి అనేక‌న్నా అనూహ్య రీతిలో బ‌హుళ ప్ర‌జాద‌ర‌ణ‌ను నోచుకుంది అని రాయ‌డ‌మే స‌బబు.తాజాగా రాధే శ్యామ్ చిత్రంతో అటు ప్ర‌భాస్, ఇటు పూజా హెగ్డే ముంబ‌యి దారుల్లో సంద‌డి చేస్తున్నారు.ఇప్ప‌టికే హిందీ వెర్ష‌న్ ను ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. మంచి స్పంద‌న కూడా వ‌స్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news