కేసీఆర్ ప్రభుత్వం మందు బాబులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది. త్వరలోనే లిక్కర్ ధరలు, ముఖ్యంగా బీర్ల ధరలను తగ్గించేందుకు తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు వచ్చాయి. బీర్ల ధరలు తగ్గించి.. సేల్స్ పెంచే దిశగా అబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది.
కెసిఆర్ ప్రభుత్వం ఆమోదం వస్తే కొత్త రేట్లు వచ్చే నెల నుంచి అంటే ఏప్రిల్ 1 తేదీ నుంచే అమలులోకి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎండాకాలం కొనసాగుతోంది. అంటే మందుబాబులు ఎక్కువగా.. బీర్లు తాగడానికే మొగ్గు చూపుతారు.
దానిని దృష్టిలో ఉంచుకుని… కేసీఆర్ సర్కార్.. బీర్ల ధరలు తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది. ఒక్క బీరుపై రూ.20 తగ్గిస్తే… సేల్స్ విపరీతంగా పెరుగుతాయని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అటు లిక్కర్ ఒక్కో బాటిల్ పై పది రూపాయలు తగ్గించేందుకు అధికారులు సన్నద్ధం అయినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ అధికారిక ప్రకటన చేయనుంది.