సబ్బంటే.. వాడేకొద్ది అరుగుతుంది.. తడిచే కొద్ది కరుగుతుంది. అలా నెలకు అయిపోతుంది.. కొత్తది తీస్తాం. కానీ స్టెయిన్ స్టీల్ వస్తువులను చూశాం.. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ సోప్ వచ్చింది. చూడ్డానికి సబ్బులానే ఉంటుంది. సబ్బులానే కాదు.. సబ్బే. కానీ వాసన రాదు., నురగ అంతకంటే రాదు. మరి ఏం చేస్తాం ఈ సోప్ తో అనేగా మీ డౌట్. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మీ చేతికి ఉన్న జిడ్డు, క్రిములను, వాసనను తొలగిస్తుంది. భలే వింతంగా ఉంది కదూ..!
ఈ సోప్ మీ చేతికి అంటుకున్నా దుర్వాసనను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. వంటగదిలో ఉల్లిపాయ లేదా వెల్లుల్లి తరిగినప్పుడు చేతులు వాసనొస్తాయి. ఈ సబ్బుతో చేతులు కడిగారంటే వాసన మాయం అవుతుందనన్నమాట. మీ చేతులకు అంటుకున్న సల్ఫర్ అణువులను తొలగించి, దుర్వాసనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్లనే చేతి దుర్గంధాన్ని తొలగించడానికి ఈ సబ్బును ప్రత్యేకంగా తయారు చేశారట.
ఈ సబ్బును ఎలా ఉపయోగించాలి?
ఈ సబ్బును ఉపయోగించడానికి ప్రత్యేక విధానం ఏం లేదు. మనం సాధారణ సబ్బులానే ఈ సబ్బును కూడా వాడేయొచ్చు. అయితే సబ్బు నురగ వచ్చే వరకూ రద్దడం అలవాటు. అలా అని దీన్ని రుద్దితే.. ఎంతకూ నురగ రాదు.. చేతులను శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సబ్బును నీళ్లతో తడిపి చేతులతో రుద్దితే చేతి వాసన పోతుంది.
కాస్ట్ ఎంత?
స్పెషల్ గా ఉంది కదా.. బాగా కాస్ట్లీ అనుకుంటున్నారేమో.. మరీ అంత ఖరీదు కాదులేండి. ఈ సబ్బు ధర రూ.250 నుంచి రూ.500 వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా స్టెయిన్ లెస్ స్టీల్ సబ్బును ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఇది అందుబాటులో ఉంది. ఈ సోప్ ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నా ఇప్పటికీ చాలామందికి దీని గురించి తెలియదు. వంటగదిలో ఎగ్ తో ఏదైనా చేసినప్పుడు చేతులు బాగా స్మెల్ వస్తాయి. అలాంటప్పుడు కూడా ఈ సోప్ ను వాడుకోవచ్చు. చూడ్డానికి కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓసారి అమేజాన్ లో చూడండి మరీ..!