బెజవాడ పాలిటిక్స్..వైసీపీ-టీడీపీ నుంచి కొత్త అభ్యర్ధులు?

-

గత కొన్ని రోజులుగా బెజవాడ రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీ కేశినేని నాని…సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో..బెజవాడ తమ్ముళ్ళ మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది..పైగా తనకు వ్యతిరేకంగా తన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ ని టీడీపీ అధిష్టానం ఎంకరేజ్ చేయడంపై కూడా నాని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తన సోదరుడు టార్గెట్ గా కూడా నాని ఫైర్ అవుతూ వచ్చారు.

ఇటు నాని సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్ని ఏమో…తన అన్నతో విభేదాలు ఉన్నాయని, కానీ చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని చెబుతున్నారు. అంటే పరోక్షంగా ఎంపీ సీటులో పోటీ చేస్తానని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నాని తనయురాలు శ్వేత…నిశ్చితార్థ వేడుకకు…చంద్రబాబు, లోకేష్..టీడీపీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ వేడుకలో నాని…బాబుతో బాగా ఆప్యాయంగా నడిచారు.

దీని బట్టి చూస్తే నాని…టీడీపీని వీడరని తెలుస్తోంది. కానీ సొంత పార్టీలో తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని నాని వదిలిపెట్టేలా లేరు. అయితే నెక్స్ట్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని నాని చెబుతున్నారు…అలాగే తన తనయురాలుని బరిలో దింపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటు ఏమో చిన్ని…నెక్స్ట్ విజయవాడ ఎంపీగా బరిలో దిగేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే చిన్ని…తన పని మొదలుపెట్టేశారు…ఇదే క్రమంలో తాజాగా వంగవీటి రాధాతో చిన్ని భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.

పరిస్తితులని బట్టి చూస్తుంటే నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు చిన్నికే దక్కేలా ఉంది…అటు వైసీపీలో కూడా ఎంపీ సీటుపై చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు…ఓడిపోయాక ఆయన పార్టీలో కనిపించడం లేదు…దీంతో నెక్స్ట్ ఆయనకు సీటు ఇవ్వొద్దని వైసీపీ కేడర్ డిమాండ్ చేస్తుంది. దీని బట్టి చూస్తే వైసీపీ నుంచి కూడా కొత్త అభ్యర్ధి విజయవాడ బరిలో దిగుతారని అర్ధమవుతుంది. మొత్తానికి బెజవాడ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version