పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ పార్టీ గెలిచే ఛాన్స్..!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఈ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్నింటికంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అందరూ ఆసక్తి చూపారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ‘టైమ్స్ నౌ-సీ ఓటర్’ తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒపీనియన్ పోల్ నిర్వహించింది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పార్టీ గట్టిపోటీ ఇచ్చినా.. తృణమూల్ కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత సీట్లు సంపాదించుకుంటుందని తెలిపారు. అసోంలో బీజేపీ అధికారంలో రానుందని, పుదుచ్చేరిలో మాత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందన్నారు.

mamata banarjee
mamata banarjee

తమిళనాడులో ఊహించిన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తాయని టైమ్స్ నౌ వెల్లడించింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి భారీ పరాభవాన్ని చవి చూడనుందని తెలిపారు. డీఎంకే అధ్యక్షతన కూటమిని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కేరళ రాష్ట్రంలో వామపక్ష కూటమికి ఈ సారి కాస్త అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గినా.. అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ అధికారంలోకి వస్తే.. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోనుంది. 2016లో కేవలం 3 సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈసారి ఎన్నికల్లో 100కుపైగా అసెంబ్లీ స్థానాలు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో తృణమూల్ కాంగ్రెస్‌కు 152-168 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 104-120 సీట్లు, వామపక్షాలు-కాంగ్రెస్-ఐఎస్ఎఫ్‌కు 18-26 సీట్లు రానున్నట్లు తెలిపాయి.

అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్డీయే పార్టీకి 65-73 సీట్లు, మహాజోత్ పార్టీకి 52-60, ఇతరులకు 0-4 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారం కోల్పోనుంది. డీఎంకే-కాంగ్రెస్-మిత్రపక్షాలు కలిపి 173-181 సీట్లు గెలుచుకోనున్నారు. అన్నాడీఎంకే-బీజేపీ-మిత్రపక్షాలు 45-53 సీట్లకే పరిమితం కానుంది. ఏఎంఎంకే పార్టీకి 1-5 సీట్లు రానున్నాయి. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎల్‌డీఎఫ్ పార్టీకి 77, యూడీఎఫ్ పార్టీకి 62 సీట్లు రానున్నాయి. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీయే పార్టీకి 19-23 సీట్లు, కాంగ్రెస్-డీఎంకే పార్టీకి 7-11 సీట్లు రానున్నట్లు టైమ్స్ నౌ జోస్యం చెప్పింది.