భారత్ లో కరోనా రెండో వేవ్ తగ్గుతుంది. 4 లక్షల కేసుల నుంచి భారీగా కేసులు తగ్గుతూ వచ్చాయి. గడచిన 24 గంటలలో 3,11,170 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 4077 మంది మృతి చెందారు. 2 కోట్ల 46 లక్షల 84 వేలకు పైగా ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి.గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 3,62,437 గా ఉంది.
దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 36,18,458 గా ఉంది. “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,07,95 335 గా ఉంది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,70,284 గా ఉంది. దేశంలో 84.25 శాతం కరోనా రోగుల రికవరీ అయ్యారు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 14.66 గా ఉంది.